ఇబ్రహీంపట్నం: త్రిపుల్ ఐటీలో సీట్లు సాధించిన మోడల్ స్కూల్ విద్యార్థులు

2చూసినవారు
ఇబ్రహీంపట్నం: త్రిపుల్ ఐటీలో సీట్లు సాధించిన మోడల్ స్కూల్ విద్యార్థులు
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో పదవ తరగతి చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన అయిండ్ల అమూల్య, పత్తిరెడ్డి హరిణి విద్యార్థులు బాసర త్రిపుల్ ఐటీ లో సీట్లు సాధించారు. గత మాసంలో వెలువడిన పదవ తరగతి పరీక్షలలో అయిండ్ల అమూల్య 561 మార్కులతో మండల టాపర్ గా నిలిచి త్రిపుల్ ఐటీ సాధించగా, 542 మార్కులు సాధించిన పత్తిరెడ్డి హరిణి సీటు సాధించడం జరిగింది. ఈ సందర్బంగా విద్యార్థులను ప్రిన్సిపల్ అభినందించారు.

సంబంధిత పోస్ట్