జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, సంఘటన వివరాలను మాజీ మంత్రి జీవన్ రెడ్డి అడిగి తెలుసుకున్నరు. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు మృతుల కుటుంబాలకు రూ 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్లు తెలిపారు.