ప్లాస్టిక్ వాడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ప్రత్యేక అధికారి బి. ఎస్ లత అన్నారు. జగిత్యాల అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు మరియు మున్సిపల్ కమీషనర్ A. మారుతి ప్రసాద్ ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, చికెన్ సెంటర్లు, ఆర్డర్ మెస్లలో పరిశుభ్రత, నిషేధిత ప్లాస్టిక్ వాడకంపై పుర అధికారులు మంగళవారం తనిఖీ చేపట్టారు. తాజా ఆహారాన్ని మాత్రమే విని యోగదారులకు అందించాలని సూచించారు.