జగిత్యాల: లోక్ అదాలత్ లో రాజీతోనే సత్వర న్యాయం: సివిల్ జడ్జి

78చూసినవారు
జగిత్యాల: లోక్ అదాలత్ లో రాజీతోనే సత్వర న్యాయం: సివిల్ జడ్జి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి కక్షిదారులు పరస్పరం రాజీ పడటం ద్వారానే సత్వర న్యాయం జరుగుతుందని సీనియర్ సివిల్ జడ్జి డి నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ సందర్బంగా మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. కేసుల విచారణలో జాప్యాన్ని నివారించడానికి ఇరు పార్టీలు రాజీ పడటం ఉత్తమం అని అన్నారు. ప్రస్తుత లోక్ అదాలత్ లో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారం కావడంలో కృషి చేసిన న్యాయవాదులకు, పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్