జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంతోనే అందరికీ సమన్యాయం సమాజంలోని సామాజిక అసమానతలను తొలగించి అణగారిన వర్గాలకు సమన్యాయం అందించాలనే లక్ష్యంతో అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో అనేక అంశాలకు చోటు కల్పించారని ఆయన పేర్కొన్నారు.