కథలాపూర్ మండలం తకల్లపెల్లి శ్రీఆండాళ్ లక్ష్మివేంకటేశ్వర స్వామి ఆలయ కమిటీలో శాశ్వత కటిమి సభ్యులుగా తాటికొండ రంజిత్ అరుణ దంపతులు పేర్లను నమోదు చేసుకున్నట్లు అయాల కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు బుధవారం సభ్యత్వం నమోదు చేసుకొని రశీదును అందజేశారు. ఈప్రాంతంలో ఎంతో పేరుగాంచిన దేవాలయంగా శ్రీఆండాళ్ లక్ష్మివేంకటేశ్వర స్వామి దేవాలయం ఉందని భక్తులు స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో వస్తుంటారన్నారు.