కోరుట్ల: ధర్మ సంస్థాపనకే అవతారాలు

7చూసినవారు
కోరుట్ల: ధర్మ సంస్థాపనకే అవతారాలు
సమాజంలో అధర్మం, అవినీతి పెరిగినప్పుడు ధర్మ సంస్థాపన కోసమే భగవంతుడు అవతరిస్తాడని శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ పేర్కొన్నారు. సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో కోరుట్ల వాసవి కళ్యాణ భవనంలో 'శ్రీ నారద మహా పురాణ సప్తాహం' 3వ రోజు ఆదివారం వైభవంగా జరిగింది. పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు మోటూరి రాజు, సమితి సమన్వయ కార్యదర్శి భోగ శ్రీధర్ దంపతులు గురువందనం చేశారు.

సంబంధిత పోస్ట్