కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో ముక్కోటి ఏకాదశి సందర్బంగా శుక్రవారం శ్రీ అనంతపద్మ నాభ స్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులు శ్రీ మునీందర్, గిరి, స్వామి వారికి పూలమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్తర ద్వారా దర్శనం నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకొనేందుకు వేకువ జాము నుంచే మహిళలు మంగళహారతులతో ఆలయం వద్దకు చేరుకున్నారు.