కోరుట్ల పట్టణంలో సమ సమాజ స్థాపికుడు, దళిత బహుజన వర్గాల ఆశజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్స్టాండ్ అవుట్ గేట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ పూలమాల వేసి స్మరించుకున్నారు. వారితో పాటు కోరుట్ల పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.