అంగన్ వాడీ కేంద్రాలలో పోషణతో కూడిన విద్యను అందించడమే లక్ష్యమని కోరుట్ల ఐసీడీఎస్ సూపర్ వైజర్ అలవాల భారతి అన్నారు. గురువారం కోరుట్ల పట్టణంలోని బుడిగ జంగాల కాలనీలో మహిళా అభివృద్ది, శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో అమ్మ మాట–అంగన్ వాడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఐసీడీఎస్ సూపర్ వైజర్ అలవాల భారతి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పోషణతో కూడిన విద్యను అందించేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నామని వెల్లడించారు.