అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త, ప్రాణదాత కటుకం గణేష్ కు ఆత్మీయంగా ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెటుపల్లి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ గంగాసాగర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగాసాగర్ మాట్లాడుతూ కోరుట్ల చుట్టుపక్కల గ్రామాలలో ఎవరికి అవసరం ఉన్న అత్యవసర సమయంలో రక్తాన్ని అందించడంలో ముందంజలో ఉన్న కటుకం గణేష్ ధన్యజీవి అని అభినందించారు.