ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శనివారం కోరుట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడరై వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నరసింహ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారుచేసిన పాయసం 108 గంగాలములలో స్వామి వారికి నైవేద్యం సమర్పించారు. అనంతరం తిరుప్పావై సేవా కాలం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో విక్రం, జూనియర్ అసిస్టెంట్ నరసయ్య భక్తులు పాల్గొన్నారు.