హనుమాన్ జయంతి వేడుకలు కోరుట్ల పట్టణంలో శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి దేవాలయాలలో ఆయా ఆలయాల అర్చకులు మూలస్వామికి పంచభూతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రత్యేకంగా పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా ఆలయాల నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.