కోరుట్ల పట్టణ కాలేజీ గ్రౌండ్ లో జరుగుతున్న జువ్వాడి రత్నాకర్ రావు స్మారక కోరుట్ల ప్రైమరీ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జువ్వాడి నర్సింగరావు, ప్రభుత్వ విప్, వేములవాడ నియోజకవర్గం శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.