ఐసిటిసి సంపూర్ణ సురక్ష ఆధ్వర్యంలో గురువారం కోరుట్ల మున్సిపాలిటీలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల మున్సిపల్ సిబ్బందికి సుమారు 150 మందికి పైగా వివిధ రకాల రక్త పరీక్షలు చేసి వారికి మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్, కోరుట్ల సూపరింటెండెంట్ డాక్టర్ సునీత రాణి, డాక్టర్ వినోద్, డాక్టర్ శృతి లయ, డాక్టర్ శివాని, తదితరులు పాల్గొన్నారు.