కోరుట్ల మండలంలోని చిన్నమెట్ పల్లి మోహనరావు పేట గ్రామాల్లో మంగళవారం ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కోరుట్ల ఎమ్మెల్యే డా సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం రైతులు కష్టించి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకవచ్చి అమ్ముకోవాలన్నారు. దళారీలకు విక్రయించి మోసాలకు గురికావద్దని ఎమ్మెల్యే డా సంజయ్ తెలిపారు.