కోరుట్ల పట్టణంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు శుక్రవారం వైభవంగ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అతి పురాతన దేవాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము, శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం, అష్టలక్ష్మి సాహిత లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అలాగే శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణ రావు ప్రత్యేకంగా పాల్గొని పూజలు నిర్వహించారు.