పౌష్టికాహారంతోనే పరిపూర్ణ ఆరోగ్యం అని ఐసీడీఎస్ సీడీపీఓ కాశ్ పాక మణెమ్మ అన్నారు. పోషణ పక్వాడ్, పోషణ పక్షంలో భాగంగా మంగళవారం కోరుట్ల పట్టణంలోని మ్యాదరి వాడ అంగన్ వాడి కేంద్రంలో గర్భిణీ, బాలింతలకు పరిసరాల పరిశుభ్రత, రక్తహీనత గురించి ఆమె అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సీడీపీఓ కాశ్ పాక మణెమ్మ మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలకు పోషక విలువలతో కలిగిన ఆహారం అందించాలని అన్నారు.