ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని మండల విద్యాధికారి గంగుల నరేష్ అన్నారు. కోరుట్ల మండలంలోని యూసఫ్ నగర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను చేర్పించడానికి ప్రత్యేకంగా బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి గంగుల నరేష్ మాజీ జిల్లా గ్రంధాల సంస్థ డైరెక్టర్ గుగ్గిళ్ళ సురేష్ గౌడ్ హాజరైన ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు.