మల్లాపూర్ మండలం పాతదాంరాజ్ పల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు సమదుస్తులు, పాఠ్యపుస్తకాలు, అలాగే నోట్ బుక్కుల పంపిణీకి ఉపాధ్యాయులతో కలిసి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఉచితంగా ఏక రూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు, అలాగే నోట్ బుక్కులను అందజేయడం గొప్ప విషయం అని పేర్కొన్నారు.