మున్సిపల్ కమిషనర్ టి. మోహన్ మెట్ పల్లి పట్టణంలోని 11 వార్డులో తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త గురించి శనివారం ప్రజలకు అవగాహన కల్పించారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ఇంటి నుంచి ఇచ్చే తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తను వేరు వేరు చేసి మున్సిపల్ ఆటోలకు ఇవ్వాలని కోరారు. పట్టణంను చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.