మెట్ పల్లి మండలం కొండ్రికర్లలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ నిధుల నుండి ఆదివారం కురుమ యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 4 లక్షల రూపాయల ప్రొసీడింగ్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజు పాల్ రెడ్డి మాట్లాడుతూ మెట్ పల్లి మండలంలోని ప్రతి గ్రామానికి ఎంపీ లాడ్స్ ద్వారా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తామని తెలిపారు.