మా వినతిని మన్నించి ప్రజా ప్రభుత్వం గురుకులాలను, విద్యా కమిషన్ కు పాఠశాలలను సందర్శించమని ఆదేశాలు జారీ చేయడం హర్షించదగ్గ విషయం అని శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సుఖీభవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు నాగరాజు అన్నారు.మెట్పల్లి రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ అధ్యక్షులు నాంపల్లి గట్టయ్య ఎస్సీ గురుకులాల పేరెంట్ కమిటీ జనరల్ సెక్రటరీ తరి స్వామి, గురుకులాల పేరెంట్ కమిటీ జనరల్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.