జగిత్యాల జిల్లా మెట్‌పల్లి డివిజన్ పరిధిలోని మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి మండలలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో శుక్రవారం ముందస్తు మకర సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు విద్యార్థిని, విద్యార్థులకు సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. హరిదాసులు, గంగిరెద్దులు, భోగి, కనుమ ఏర్పాట్లను చేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి ఉత్సవాలను ఆడంబరంగా జరుపుకున్నారు.