మెట్‌పల్లి మున్సిపల్ కార్యాలయంలలోని మెప్మా బిల్డింగ్ లో శుక్రవారం మహిళా సంఘ సభ్యులకు మరియు పారిశుద్ధ్య మహిళా కార్మికులకు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఉద్దేశించిన ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించబడింది. ఒక మార్పు అభివృద్దికి మలుపు 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమంలో అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు.