జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని మండల వనరుల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం పీఆర్టీయూ టీఎస్ 2025 డైరీ ని మండల విద్యాధికారి ఎం చంద్రశేఖర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను సాధించడంలో పీఆర్టీయూ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ మెట్‌పల్లి మండల అధ్యక్షులు గంగా ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కావలి బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు.