జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని శనివారం పట్టణంలోని పలు దేవాలయాల్లో పెద్దఎత్తున భక్తులు ఆంజనేయస్వామి దర్శనం చేసుకున్నారు. పట్టణంలోని హనుమాన్ ఆలయాలలో ఆలయ కమిటీ వారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్న ప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. కాశీ బాగ్ హనుమాన్ ఆలయంలో హోమం చేశారు.