జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో శుక్రవారం నిఖిల్ భరత్ కాన్వెంట్ స్కూల్ ప్రిన్సిపల్ వేముల భృగు మహర్షి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అట్టహాసంగా ఏర్పాటు చేసినటువంటి ముందస్తు సంక్రాంతి సంబరాలకు ప్రారంభించడానికి ముందు వారు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గోదాదేవి వెంకటేశ్వరులు చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పొంగలి, రేగు పళ్ళు పిల్లలపై ఆశీర్వాదం చేసి పూజ కార్యక్రమాలు నిర్వహించారు.