మెట్ పల్లిలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జెట్టి లింగం ఆధ్వర్యంలో తొలి మహిళా ఉపాద్యాయురాలు సావిత్రి బాయి పూలే 194వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెట్టి లింగం పాల్గొని సావిత్రి బాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అభ్యున్నతికి ఆమె మార్గం చూపారన్నారు. బహుజనుల కోసం ఆమె కృషి చేశారని ఆయన అన్నారు.