లయన్స్ క్లబ్ మెట్ పల్లి శాఖ నూతన కార్యవర్గం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. క్లబ్ నూతన అధ్యక్షులుగా ఇల్లెందుల ఐలాపూర్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా గుండా రాకేష్, కోశాధికారిగా నాంపల్లి వేణుగోపాల్, జోనల్ చైర్మన్ గా గడ్డం శంకర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వీరిని లయన్స్ క్లబ్ సభ్యులు ఇతర నాయకులు అభినందించారు.