కథలాపూర్ మండల్ తకల్లపల్లి గ్రామానికి చెందిన దమ్మ సింధు శుక్రవారం ప్రకటించిన ఐఐఐటి ఫలితాలలో సీటు సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రతిష్టాత్మక ఐఐఐటి సీటు సాధించిన సింధును పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మోటూరి రవీందర్ మరియు ఉపాధ్యాయులు రాజశేఖర్, గంగాధర్, శ్రీహరి, హరినాథ్, మరియు ఉపాధ్యాయ బృందం, AAPC ఛైర్మెన్, గ్రామస్తులు అభినందించారు.