దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జైహింద్ పేరిట ర్యాలీలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. భారత్ పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ మౌనం వహించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ర్యాలీలు చేస్తామని ప్రకటించారు. అఖిలపక్ష భేటీకి కూడా ప్రధాని మోదీ రాలేదని జైహింద్ ర్యాలీలలో ఈ అంశంపై కూడా నిలదీస్తామని తెలిపారు.