కేంద్ర బడ్జెట్‌పై జైరాం రమేశ్ మండిపాటు

75చూసినవారు
కేంద్ర బడ్జెట్‌పై జైరాం రమేశ్ మండిపాటు
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌పై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తీవ్రస్థాయలో మండిపడ్డారు. ఈ బడ్జెట్‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులను పెంచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది ఈ పథకానికి ముందుగా రూ.60,000 కోట్లు కేటాయించగా.. అదనపు నిధులు ఇవ్వడంతో అది రూ.89,153.71 కోట్లు అయిందన్నారు. 2025 బడ్జెట్‌లోనూ రూ.86,000 కోట్లు కేటాయించారని, గతేడాదితో పోల్చితే నిధుల కేటాయింపులో ఎటువంటి పెరుగుదల లేదని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్