ఆసియా క్రీడల రజత పతక విజేత డిపి మనుపై NADA నాలుగేళ్ల నిషేధం విధించింది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో మను నిషేధిత పదార్థం తీసుకున్నట్లు తేలింది. గతేడాది ఏప్రిల్‌లో బెంగళూరులో జరిగిన అథ్లెటిక్స్ మీట్ సందర్భంగా తీసిన నమూనాలో నిషేధిత మిథైల్ టెస్టోస్టెరాన్ వాడినట్లు తేలింది. దీంతో అతనిపై మొదట తాత్కాలిక నిషేధం, తర్వాత ఎడిడిపి తీర్పు అనంతరం నిషేధం ఖరారయ్యింది. 2024 జూన్-2028 వరకు మను క్రీడలలో పాల్గొనలేరు.