జయ ఆస్తులు రూ.4,000 కోట్లు.. మొత్తం తమిళనాడుకే..

83చూసినవారు
జయ ఆస్తులు రూ.4,000 కోట్లు.. మొత్తం తమిళనాడుకే..
కీర్తిశేషులు, మాజీ సీఎం జయలలిత ఆస్తిని ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని బెంగళూరు స్పెషల్ కోర్టు ఆదేశించింది. దీంతో 1,562 ఎకరాల భూమి, 27 కిలోల బంగారు, వజ్రాభరణాలు, పది వేలకు పైగా చీరలు, 750కి పైగా జతల చెప్పులు, వాచ్‌లను కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది. దశాబ్దం క్రితం ఈ ఆస్తుల విలువ రూ. 913 కోట్లు కాగా, ప్రస్తుతం వాటి మార్కెట్‌ విలువ రూ. 4,000 కోట్లు.

సంబంధిత పోస్ట్