జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. కాటారం మండలం శంకరాంపల్లిలోని బుడగ జంగాల కాలనీలో సత్యమ్మ ఇంట్లోకి చొరబడి 18 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. కూతురి ప్రసవం కోసం సత్యమ్మ నాలుగు రోజుల క్రితం ఆసుపత్రికి వెళ్లింది. గురువారం ఇంటికి రాగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.