గద్దర్ అవార్డుల కమిటీ జ్యూరీ ఛైర్మన్‌గా జయసుధ

76చూసినవారు
గద్దర్ అవార్డుల కమిటీ జ్యూరీ ఛైర్మన్‌గా జయసుధ
TG: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రముఖ జానపద గాయకుడు, ఉద్యమకారుడు గద్దర్ అవార్డులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డుల కమిటీ జ్యూరీ ఛైర్మన్‌గా తాజాగా సీనియర్ నటి జయసుధను నియమించారు. ఈ సందర్భంగా జయసుధ అధ్యక్షతన గద్దర్ అవార్డ్స్ జ్యూరీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కూడా పాల్గొన్నారు. అవార్డుల ఎంపికలో ఎలాంటి పక్షపాతం లేకుండా ఎంపిక చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్