కాలువలోకి దూసుకెళ్లిన జీపు.. 9 మంది మృతి

79చూసినవారు
కాలువలోకి దూసుకెళ్లిన జీపు.. 9 మంది మృతి
హర్యానాలోని ఫతేహాబాద్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుక నుంచి 13 మందితో తిరిగి వస్తున్న ఓ జీపు అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడిక్కక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి.. ఇద్దరిని కాపాడారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, 11 ఏళ్ల చిన్నారి ఉన్నారని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్