రామభద్రాచార్యకు జ్ఞానపీఠ పురస్కారం

53చూసినవారు
రామభద్రాచార్యకు జ్ఞానపీఠ పురస్కారం
ప్రముఖ సంస్కృత వేద పండితుడు జగద్గురు రామభద్రాచార్య 58వ ‘జ్ఞానపీఠ్‌’ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు 58వ జ్ఞానపీఠ పురస్కారాన్ని అందించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం ఈ వేడుక జరిగింది. సాహిత్యం, సామాజిక సేవ రంగాల్లో జగద్గురు రామభద్రాచార్య సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. రామభద్రాచార్య (74) మధ్యప్రదేశ్‌ చిత్రకూట్‌లోని తులసీ పీఠం వ్యవస్థాపకులు, పీఠాధిపతి. 22 భాషల్లో ప్రావీణ్యులు.

సంబంధిత పోస్ట్