నేడు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల

63చూసినవారు
నేడు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల
ప్రభుత్వం ఇవాళ జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటిస్తారని వెల్లడించారు. జాబ్‌ క్యాలెండర్‌కు చట్టబద్ధత తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పొంగులేటి మీడియాకు వివరించారు. ఏటా నిర్దిష్ట కాలవ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేలా ఆమోదం తెలిపిందన్నారు.

ట్యాగ్స్ :