సీఎం రేవంత్ రేపు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ కు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. సిరాజ్, నిఖత్ జరీన్ లను ఉద్యోగాలతో పాటు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. కొత్త రేషన్ కార్డుల కోసం సబ్ కమిటీ ఏర్పాటు నిర్ణయించామన్నారు. ఉత్తమ్ అధ్యక్షతన ఈ సబ్ కమిటీ కొత్త రేషన్ కార్డుల జారీకి విధివిధానాలను రూపొందించనున్నట్లు తెలిపారు.