తెలంగాణ ప్రభుత్వం 2008 డీఎస్సీ బాధితులకు శుభవార్త చెప్పింది. 1,382 మంది డీఎస్సీ బాధితులకు కాంట్రాక్టు టీచర్ ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి కాంట్రాక్టు విధానంలో ప్రతి నెల రూ.31,040 వేతనంలో నియమించనున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరి సర్వీసు ప్రతి విద్యా సంవత్సరం చివరి రోజును ముగిసి.. తదుపరి విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి అవసరాలకు అనుగుణంగా నియామకం చేయనున్నట్లు ప్రకటించింది.