ప్రముఖ తెలుగు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కన్నీరు పెట్టుకున్నారు. బెంగళూరులో జరుగుతున్న ఓ సినిమా స్పాట్‌కు వెళ్లిన ఆయనకు చిత్ర బృందం ఘన స్వాగతం పలికింది. వారు చూపించిన ప్రేమకు ఆయన సంతోషంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, జానీ మాస్టర్‌పై ఓ డ్యాన్సర్ లైంగిక వేధింపుల కేసు పెట్టగా ఇటీవల ఆయన జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే.