అత్యాచారం కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు కోర్టు రిమాండ్ విధించింది. తన అసిస్టెంట్‌గా ఉన్న లేడీ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం చేశారనే ఆరోపణలపై బాధితురాలి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాలో గురువారం ఆయనను అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉప్పరపల్లి కోర్టులో ఆయనను హాజరు పర్చగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.