సామాన్యులకు రక్షణ కల్పించడమే న్యాయవ్యవస్థ ప్రాథమిక బాధ్యత అని, అది ఎప్పుడూ నిష్పక్షపాతంగా ఉండాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కోల్‌కతాలో జరిగిన నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ కాన్ఫరెన్స్‌లో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. కోర్టు అంటే గుడి, చర్చి, మసీదు, గురుద్వారా లాంటిది. న్యాయవ్యవస్థను మెరుగుపరచడానికి రూ.1,000 కోట్లు వెచ్చించాం. మేము 88 ఫాస్ట్ ట్రాక్ మరియు 99 మానవ హక్కుల కోర్టులను ఏర్పాటు చేసాము' అని ఆమె తెలిపారు.