లేటెస్ట్ ఫ్యాషన్ డిజైన్లను అనుసరించి ఆకర్షణీయంగా తయారవుతున్న వస్త్రాలన్నింటికీ నాంది కుట్టు మిషన్. పల్లెటూళ్లలో కుట్టుపనితో జీవనోపాధి పొందే కుటుంబాలు ఇప్పటికి ఎన్నో ఉన్నాయి. కుట్టు యంత్రానికి 20వేల ఏళ్ల చరిత్ర ఉందండోయ్. మొదట్లో జంతువుల ఎముకలు, కొమ్ములతో సూదులు తయారుచేసేవారట. అనేక రూపాంతరాల తర్వాత కుట్టు యంత్రాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుత ఆధునిక కుట్టు యంత్రాలకు అమెరికాకు చెందిన ఐజాక్ సింగర్ ఆద్యుడు.