ప్రతి సంవత్సరం జూన్ 5 రాగానే ప్రకృతి ప్రేమికులకు మనసులో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. నిత్యం ప్రకృతితో మమేకమై ఉండే ప్రతి ఒక్కరికీ ఈ రోజు పండుగలాగే ఉంటుంది. ఒక్కసారిగా బాల్యస్మృతులు గుర్తుకు వస్తాయి. చిన్నప్పుడు స్కూల్లో మొక్కలు నాటడం, ప్రతిరోజూ నాటిన మొక్కలకు నీళ్లు పోయడం, తిరిగి స్కూల్ విడిచి పెట్టి వెళ్లే సమయంలో మొక్కలను విడిచి పెట్టలేక బాధ పడటం ఇవన్నీ మర్చిపోలేని మధుర స్మృతులు.