సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈయన సుప్రీంకోర్టు 52వ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ తాజాగా ప్రకటించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో గవాయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే.