బీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన జరగాలని కాంగ్రస్ మాజీ ఎంపీ వి హనుమంతరావు పేర్కొన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో బీసీ కులగణన బిల్లును ఇప్పటికే అసెంబ్లీలో పాస్ చేశారని, అలాగే కులగణన 85% పూర్తయిందన్నారు. ఓట్లు బీసీలవి.. రాజ్యం మీదంటే నడవదన్నారు. కేంద్రం కులగణన బిల్లు పెడితే దానికి కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు.