సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం

70చూసినవారు
సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం
భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సోమవారం ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సంజీవ్‌ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌, ప్రధాని మోదీ, కేంద్ర న్యాయశాఖమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ సహా తదితరులు హాజరయ్యారు. కాగా సీజేఐగా జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పదవీకాలం ఆదివారంతో ముగిసింది.

సంబంధిత పోస్ట్